VZM: విజయనగరం స్దానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ, సంతోషంగా జీవించవచ్చునని స్టేషన్ మేనేజర్ తెలియజేశారు.