NLG: యోగా ఆరోగ్యానికి మంచి ఔషధమని నిత్యం ఆచరించడం వల్ల ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో ఉంటారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా NTR స్కూల్లో ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమానికి విచ్చేసి యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, RDO అశోక్ రెడ్డి, కొలనుపాక గీతా రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.