W.G: నరసాపురం మండలం లింగనబోయిన చర్లలో వెలసిన గంగాలమ్మను ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారే, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.