JGL: తెలంగాణ రాష్ట్రంలో అట్టర్ ప్లాప్ ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి మండలం, గ్రామాల్లో పార్టీ బలంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో పని చేయాలని అన్నారు.