PPM: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా పాలకొండ నగర పంచాయతీ ఎదురుగా సమ్మె శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ అధ్యక్షుడు డి.రమణారావు మాట్లాడుతూ.. జీతాల పెంపుతో పాటు కేటగిరీల నిర్ణయంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని అన్నారు.