ASF: రెబ్బన మండలం వాంకుల గ్రామ గాంధారి మైసమ్మ దేవాలయంలో జరిగిన పోశమ్మ బోనాల ఉత్సవాలకు MLA కోవ లక్ష్మి ఆదివారం హాజరయ్యారు. గ్రామ మహిళలు, ప్రజలు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి MLA ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా, MLA మహిళలతో కలిసి నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం విశేషం అని గ్రామస్థులు తెలిపారు.