ADB: తలమడుగు మండల కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామి ఆదివారం పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మంత్రి బోనం ఎత్తారు. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రజలు పండుగలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. MP నగేష్, MLA అనిల్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.