ATP: గుత్తి మండల వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షం కురవకపోవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండు ముఖం పట్టాయి. వేరుశనగ, ఆముదం, కంది, పత్తి, తదితర పంటలు ఎండిపోతున్నాయి. పంటలు సాగు చేసి 20 రోజులు అవుతున్న వర్షం జాడ కనబడడం లేదు. వరుణ దేవుడి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిస్తే తప్ప సాగుకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.