ELR: కుటుంబ సమస్యల వల్ల ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతీ ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రూపులో వచ్చిన మిస్సింగ్ ఫోటో ప్రకారం ఏలూరు శక్తి టీం ఆ యువతిని ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద శనివారం రాత్రి గుర్తించారు. వెంటనే ఆమెను ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్కు అప్పగించారు.