NLR: విడవలూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో శ్రీ అంకమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.