ATP: విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ వారు భారతదేశంలోని హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం జనవరి 5వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ హైందవ శంఖారావం కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విశ్వహిందూ పరిషత్ కమిటీ సభ్యులకు ఆదివారం లక్ష రూపాయల విరాళంగా అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.