విశాఖ ఉమ్మడి జిల్లాల వాహనదారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. సబ్బవరం మండలం దేవీపురంలో ఉన్న ఒకే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్(ఏటీఎస్) వద్ద రోజూ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎనిమిదేళ్ల లోపు వాహనాలకు రెండేళ్లకు ఒకసారి, ఆపై ప్రతి ఏడాది ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి కావడంతో వాహనదారులకు ఒత్తిడి పెరిగింది.