GNTR: వేమూరు నియోజకవర్గం చుండూరు, అమృతలూరు మండలాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. చుండూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అర్హులైన వారికి పంపిణీ చేశారు.