ASR: పీఎల్ జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని సీలేరు ఎస్సై రవీంద్ర తెలిపారు. సోమవారం రాత్రి ఒడిశా, ఛత్తీస్ఘఢ్ సరిహద్దు ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికులను ప్రశ్నించి విడిచి పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఆందోళన వద్దని ప్రజలకు సూచించారు.