VSP: ఏయూ అంతర్ కళాశాలల మహిళల ఖోఖో ఎంపిక పోటీలు శుక్రవారం విశాఖ ఉమెన్స్ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 9 జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులను ఏయూ జట్టుగా విద్య డైరెక్టర్ విజయ మోహన్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.