ATP: అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సెమినార్ హాల్లో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై అధికారులతో చర్చించారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.