కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం రాత్రి రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు, బ్యాగ్ లిఫ్టింగ్ తదితర నేరాలు జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.