CTR: నగరి మున్సిపాలిటీ KVPR పేట జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.