ASR: రాజవొమ్మంగి మండలవ్యాప్తంగా శనివారం ‘స్వచ్ఛ సంక్రాంతి’ సంబరాలు జరిగాయి. రాజవొమ్మంగి, జడ్డంగి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో జడ్డంగి కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ వేళ గ్రామాలు చెత్త లేకుండా అందంగా ఉండడమే స్వచ్ఛ సంక్రాంతి లక్ష్యమని తెలిపారు.