సత్యసాయి: పెనుకొండ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కేశవరావు సోమవారం తెలిపారు. కామర్స్, గణిత శాస్త్రం, వృక్షశాస్త్రం, చరిత్ర సబ్జెక్టులలో బోధించుటకు అతిథి అధ్యాపకులు కావాలన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ 55% ఉత్తీర్ణత కలిగిన వారు ఈ నెల 6లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.