ప్రకాశం: తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని గోదాంలో అక్రమంగా నిలువ ఉంచిన 21 సిలిండర్ లను ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. రాబడి సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు డొమెస్టిక్ సిలిండర్లు 15, కమర్షియల్ సిలిండర్లు 6 స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.