KRNL: కౌతాళంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి గురువారం అందజేశారు. ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ చెన్న బసప్ప, దమ్ములదిన్నె సర్పంచ్ రమేశ్ గౌడ్ చేతుల మీదుగా బాపురం మాల హనుమేషుకు రూ.37,465 విలువైన చెక్కు అందించారు. ఈ సందర్భంగా పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందుతుందని చెన్న బసప్ప పేర్కొన్నారు.