ASR: హుకుంపేట మండలం ముసిరిపాడు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఈనెల 26న హిట్ టీవీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు బుధవారం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేశారు. గ్రామంలో మూడు రోజుల్లో బోర్వెల్, మోటార్ ఏర్పాటు చేసి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.