E.G: కూటమి ప్రభుత్వం నగర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక గౌతమి గ్రంథాలయం వద్ద సుమారు రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజల సౌకర్యార్థం నగరంలోని మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు.