CTR: రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సాదర స్వాగతం పలికారు. హెలికాప్టర్లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రిని ఎంపీ ప్రసాదరావు కలిసి స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, అధికారులు కూడా హాజరయ్యారు.