సత్యసాయి: తమిళ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోమవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో సుందరం భజన బృందం మహిళలు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. భగవంతుని ఉనికిని ప్రతి క్షణం గుర్తించేలా సాగిన ఈ ప్రదర్శన భక్తులను పరవశింపజేసింది. పలు భాషల్లోని భక్తి గీతాలు, కర్ణాటక సంగీత కీర్తనలు అద్భుతంగా ఆలపించారు.