AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 28 మంది ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ కంపెనీ స్టీల్ ప్లాంట్‌ని సందర్శించారు. ఈ పర్యటనలో స్టీలు తయారీ విధానం, మార్కెటింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ మొదలగు విషయాలను అనుభవపూర్వకంగా నేర్చుకున్నామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.