KDP: జమ్మలమడుగు పరిధిలోని గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామమైన చౌటిపల్లె గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం న్యాయం చేయాలని కోరుతూ ముంపు బాధితులు జమ్మలమడుగు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, DYFI జిల్లా కార్యదర్శి వీరణాల, శివకుమార్, చౌటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.