కృష్ణా: రాష్ట్రంలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు సోమయ్య అన్నారు. సోమవారం విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వారు చంద్రబాబును కలిశారు. ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.