ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ‘స్వచ్ఛత హి సేవ’లో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మోనాలిసా మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మెసేజ్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.