SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో ఇవాళ అందెశ్రీకి కొవ్వొత్తులతో కన్నీటి నివాళిని ఉపాధ్యాయులు, విద్యార్థులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కట్టుకురి ముఖేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఎగిసి పడడానికి అందెశ్రీ రాసిన పాట జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయం ఓ కారణమని అన్నారు.