ASR: అనంతగిరి మండలంలోని వెంగడ పంచాయతీ కేంద్రంలో సెల్ సిగ్నల్స్ అందక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. జియో టవర్ ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో వినియోగదారులు సిగ్నల్ సెల్ అందక ఇబ్బందులకు గురవుతున్నారు. వేంగడలో సిగ్నల్ సౌకర్యం అందక పోవడంతో నిరుద్యోగ యువతీ యువకులు ఆన్లైన్ శిక్షణకు ఇబ్బంది పడుతున్నారు.