పల్నాడు: నరసరావుపేటలో ఆక్రమణలపై అధికారులు దృష్టి పెట్టాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు కోరారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, వ్యాపారులు ఇష్టానుసారంగా రోడ్లు మొత్తం ఆక్రమించుకోవడంతో రాకపోకలకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.