ప్రకాశం: బీజేపీ కుట్రలను దళితులు అర్థం చేసుకోవాలని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మాంచా నాగమల్లేశ్వరి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఎటువంటి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడి ఉండాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు.