Sushmita Sen's Brother Rajeev Sen, Charu Asopa Are Officially Divorced
Celebrity Couple Divorce: సెలబ్రిటీ కపుల్స్ వరసగా విడాకులు తీసుకుంటున్నారు. ఆ జాబితాలో మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి సుష్మిత సేన్ సోదరుడు రాజీవ్ సేన్ (Rajeev Sen) చేరిపోయాడు. చారు అసోపతో (Charu Asopa) విడిపోయానని ఆయన ప్రకటించారు. వీరికి 2019లో పెళ్లి కాగా.. జియానా (Ziana) అనే కూతురు ఉంది.
ప్రేమ మాత్రం కంటిన్యూ
‘ఇద్దరు మనుషులు కలిసి ఉండలేని పరిస్థితి. ప్రేమ మాత్రం కొనసాగుతోంది. తమ కూతురికి ఇద్దరం తల్లిదండ్రులుగా ఉంటాం. ఇదీ గుడ్ బై మాత్రం కాదు.. విడాకులే అని’ రాజీవ్ సేన్ (Rajeev Sen) ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని చారు వెల్లడించారు.
నెలలపాటు దూరంగా ఉంటాడు
రాజీవ్ (Rajeev) తమను విడిచి వారాలు, నెలల పాటు ఉంటాడని చారు అసోప గుర్తుచేశారు. దూరంగా ఉన్న సమయంలో కనీసం ఫోన్ కూడా చేయరని తెలిపారు. అతను ఎక్కడ ఉన్నాడు..? ఏం చేస్తున్నాడు అనే సంగతి తెలియదని చెప్పారు. కరోనా లాక్ డౌన్ కన్నా ముందు 3 నెలల పాటు తమను వదిలిపెట్టి ఉన్నాడని పేర్కొన్నారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నాననే భావన తనలో కలిగిందన్నారు. తర్వాత కొద్దీరోజులకు తమను వదిలి రెండు రోజులు హోటల్లో ఉన్నాడని చెప్పారు. అప్పడే తనకు జ్ఞానోదయం అయ్యిందని.. అతనేం చిన్న పిల్లవాడు కాదు, 45 ఏళ్ల వయస్సులో ఇలా చేస్తున్నాడు. అతనిని ఇకా మార్చలేం. తమ మధ్య చాలా సమస్యలు ఉండేవి.. కూతురు కోసం పరిష్కరించుకుందామని అనుకున్నా.. కానీ కుదరలేదు’ అని బాధను పంచుకున్నారు.
తిడతాడు.. కొడతాడు కూడా
రాజీవ్ (Rajeev) తనను చాలాసార్లు దూషించాడని.. కొట్టేందుకు ఒకటి రెండుసార్లు చేయ్యి ఎత్తాడని వివరించారు. అక్బర్ కా బాల్ బిర్బల్ షూటింగ్లో ఉన్న సమయంలో తన నుంచి దూరంగా ఉండాలని కో స్టార్స్ మెసేజ్ చేశాడని తెలిపారు. ఇలా అయితే తాను వర్క్ ఎలా చేయాలని ఆమె అడిగారు. భర్తే తనను మోసం చేస్తున్నాడని అనిపించిందని.. దానిని ఫ్రూవ్ చేయలేకపోయానని తెలిపారు. విడిపోయిన తర్వాత తనకు భరణం ఇవ్వాలని చారు అడగలేదు. తన కూతురు విద్య కోసం సాయం చేస్తానని రాజీవ్ తెలిపారు. రాజీవ్‌కు ఇటీవల బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. వెళ్లలేదు. చారు.. టీవీ సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.