ఏజెంట్(Agent) మూవీ ఏప్రిల్ 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'రామకృష్ణా గోవిందా' సాంగ్ (Ramakrishna Govinda)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అక్కినేని అఖిల్(Akkineni Akhil) నుంచి వస్తోన్న మరో సినిమా ఏజెంట్ (Agent). అక్కినేని అఖిల్ విభిన్న పాత్రలో ఈ మూవీలో కనిపించనున్నాడు. చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు. గతంలో అఖిల్(Akhil) నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఏజెంట్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో కండలు తిరిగిన దేహంతో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించనున్నాడు.
‘ఏజెంట్’ నుంచి థర్డ్ సింగిల్ సాంగ్:
గతంలో ఈ మూవీకి సంబంధించి పోస్టర్లు, టీజర్(Teaser) విడుదలయ్యాయి. అవి ఈ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఏజెంట్(Agent) మూవీ ఏప్రిల్ 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ వర్క్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామకృష్ణా గోవిందా’ సాంగ్ (Ramakrishna Govinda)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట బ్రేకప్ నేపథ్యంలో సాగుతుంది. ఈ లిరికల్ వీడియో(Lyrical Video) అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఏజెంట్(Agent) మూవీకి హిప్ హాప్ తమిళ(Hiphop Taminza) మ్యూజిక్ అందించారు. ‘రామకృష్ణా గోవిందా’ (Ramakrishna Govinda) సాంగ్ ను తన స్టైల్ లో క్రిస్పీగా ట్యూన్స్ అందించారు. రామ్ మిర్యాల ఈ సాంగ్ ను పాడారు. సాంగ్ లో అఖిల్(Akhil) ఎనర్జిటిక్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు చంద్రబోస్(Chandrabose) సాహిత్యం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మళ్లీ మళ్లీ, ఏంటే ఏందే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఏజెంట్(Agent) మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీకి డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణంలో సురేందర్ రెడ్డి కూడా భాగస్వామ్యమై తెరకెక్కిస్తున్నారు. అఖిల్(Akhil)కు జోడీగా ఇందులో సాక్షీ వైద్య నటిస్తోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.