Anushka shetty : కుర్ర హీరోతో కలిసి సైలెంట్‌గా ఆ పని కానిచ్చేసిన అనుష్క!
అనుష్క శెట్టి(Anushka Shetty) తెరపై కనిపించి చాలా రోజులైంది. 'నిశ్శబ్దం' సినిమా(Nissabdham movie) తర్వాత ఆమె ఏ సినిమా చేయలేదు. తాజాగా ఆమె కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి(Navin Polisetty)తో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Ms Shetty Mr polyshetty) అనే పేరుతో సినిమా చేస్తోంది.
అనుష్క శెట్టి(Anushka Shetty) తెరపై కనిపించి చాలా రోజులైంది. ‘నిశ్శబ్దం’ సినిమా(Nissabdham movie) తర్వాత ఆమె ఏ సినిమా చేయలేదు. తాజాగా ఆమె కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి(Navin Polisetty)తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Ms Shetty Mr polyshetty) అనే పేరుతో సినిమా చేస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కాంటెంపరరీ లవ్ స్టోరీ(Love story)తో అనుష్క ఈ సారి ప్రేక్షకుల ముందుకు రానుందని మాత్రం తెలుస్తోంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Ms Shetty Mr polyshetty) మూవీకి సంబంధించి గతంలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ క్లోజ్ గా ఉండటం చూడొచ్చు. లండన్ లో అనుష్క ఉంటే హైదరాబాద్ లో హీరో నవీన్(Hero navin) ఉంటాడు. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథగా ఈ మూవీ సాగుతుందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోందా? లేదా? లేకుంటే సినిమా ఆగిపోయిందా అనేది అందరూ తెలుసుకోవాలనుకుంటున్న విషయం. ఇంత వరకూ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ రాలేదు.
యువి క్రియేషన్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు గతంలో చెప్పారు. అయితే ఇంత వరకూ కూడా ఈ మూవీకి సంబంధించిన ఏ విషయాలు రాలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Ms Shetty Mr polyshetty)కి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి(Anushka shetty) చెఫ్ గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి గతంలో మరిన్ని గాసిప్స్ వచ్చాయి. సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ సినిమా ఆగిపోలేదు.
అతి త్వరలోనే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క శెట్టి(Anushka shetty) కుర్ర హీరోతో సైలెంట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసినట్లు టాక్ వినిపిస్తోంది. వేసవిలో ఈ సినిమా పక్కా అని కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం రాలేదు. అనుష్క 2020లో ‘నిశ్శబ్దం’ సినిమా(Nissabdham movie) తర్వాత మరో సినిమా చేయలేదు. అనుష్క సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లలో ఎదురు చూస్తున్నారు.