టాలీవుడ్ స్టార్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' ఏప్రిల్ 28న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని సినీ నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీలో విలన్‌గా.. హిందీలో హీరోస్, దస్ కహానియా లాంటి సినిమాల్లో నటించిన 'డినో మోరియా(Dino Morea)ను తీసుకున్నారు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత అక్కినేని(Akhil Akkineni) యంగ్ హీరో అఖిల్‌తో ‘ఏజెంట్’ మూవీ చేస్తున్నాడు స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ‘ఏజెంట్’ ప్రమోషన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. రామకృష్ణ అనే ఈ బ్రేకప్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఏజెంట్ విలన్‌గా.. హిందీలో హీరోస్, దస్ కహానియా లాంటి సినిమాల్లో నటించిన ‘డినో మోరియా(Dino Morea)’ను తీసుకున్నారు.
ఏజెంట్లో అతను ‘ది గాడ్’గా నటిస్తున్నాడు. తాజాగా డినో మోరియా పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్(first look)ని రిలీజ్ చేయగా.. ఏజెంట్ వార్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు అక్కినేని అభిమానులు. ఈ అంచనాలను మరింతగా పెంచేలా.. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో.. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఈనెల 18న కాకినాడలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ ఈవెంట్ అక్కినేని అభిమానులతో కక్కిరిసిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే.. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గతంలో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ బయటికొచ్చింది. అయితే.. ఇంకా ఈ ఈవెంట్ పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అప్పుడే గెస్ట్ ఎవరో తెలియనుంది. మరి ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఆపరేషన్ చేస్తాడో చూడాలి.