పవన్ కల్యాణ్ కొడుకు భవిష్యత్తులో హీరోగా అరంగేట్రం చేయాలని అతని అభిమానులు భావిస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(akira nandan) విషయంలో అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.
పవన్ వారసుడు అకిరా నందన్(akira nandan) హీరోగా ఎంట్రీ ఇస్తే.. అదిరిపోయే వెల్కమ్ చెప్పాలని కలలు కంటున్నారు అభిమానులు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఫ్యాన్స్ కలలు ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజి, వినోదయ సీతమ్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత పూర్తిగా పొలిటికల్ పైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ పవన్‌కు జనం జేజేలు కొడితే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే. దాంతో పవన్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే అదిరిపోతుందని భావిస్తున్నారు అభిమానులు. సమయం వచ్చినప్పుడల్లా అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అడుగుతునే ఉంది పవన్ ఆర్మీ.
కానీ అకీరా హీరో అవుతాడా? లేదా? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు అకిరా నందన్ ఇచ్చిన షాక్‌కు ఫ్యాన్స్‌లో మరిన్ని డౌట్స్ పెరిగిపోతున్నాయి. గతంలో అకిరా పియానో వాయించిన వీడియోలు.. మార్షల్ ఆర్ట్స్ వీడియోలు చూసి మల్టీ టాలెంటెడ్ అని మురిసిపోయారు అభిమానులు. దీంతో ఖచ్చితంగా అకిరా హీరో అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు అకిరా నందన్.. హీరోగా కంటే మ్యూజిక్ డైరెక్టర్(turns music director) అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
లేటెస్ట్గా ఒక షార్ట్ ఫిల్మ్‌కు సంగీతాన్ని అందించి ఆశ్చర్యపరిచాడు అకిరా. ‘రైటర్స్ బ్లాక్’ అనే షార్ట్ ఫిల్మ్‌కి అకిరా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. నాలుగు నిమిషాల ఈ షార్ట్ ఫిల్మ్‌ను కార్తికేయ యార్లగడ్డ రూపొందించాడు. అకీరా సంగీతాన్ని అందించడంతో ఈ షార్ట్ ఫిల్మ్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో అకిరా.. హీరోగా ఎంట్రీ ఇస్తాడా.. లేదంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తాడా.. అనే డైలమాలో పడిపోయారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!