»Akira Nandan Ram Charan Entered The Arena For Akiras Entry
Akira Nandan: అకీరా ఎంట్రీ కోసం రంగంలోకి దిగిన రామ్ చరణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్‌ను తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ రామ్ చరణ్, అకీరా ఎంట్రీని ఎలా ప్లాన్ చేస్తున్నాడు.
Akira Nandan: ప్రస్తుతం హీరోగా లాంచ్ అవడానికి రెడీగా ఉన్న తెలుగు స్టార్ హీరోల వారసుల లిస్ట్ తీస్తే.. మోక్షజ్ఙ తర్వాత అకీరా నందన్ సెకండ్ ప్లేస్‌లో ఉంటాడు. గత కొద్ది రోజులుగా మెగాభిమానులంతా పవన్ వారసుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ పొలిటికల్‌గా బిజీ అయితే.. అకీరాను హీరోగా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చూస్తున్నారు. ఇప్పటికే అకీరా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కానీ లాంచింగ్ ఎప్పుడనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అకీరాను సిల్వర్ స్క్రీన్కు ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత రామ్ చరణ్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం అదిరిపోయే ప్లాన్ చేస్తున్నాడట. అయితే హీరోగా లాంచ్ చేయడానికి ముందు.. చరణ్ సినిమాలో అకీరా నందన్‌ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అకీరాను కీలక ప్రాతలో తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఆ తర్వాత హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందనే టాక్ నడుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. ఆర్సీ 16 మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే.. గతంలో కూడా పవర్ స్టార్ నటిస్తున్న ఓజి సినిమాలో కూడా అకీరా నటిస్తున్నాడని వార్తలు రాగా.. అందులో నిజం లేదని తెలిసింది. ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో అకీరా అని అంటూ రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి.. ఇందులో నిజముందని ఇప్పుడే చెప్పలేం. కానీ అకీరా హీరోగా ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి.