టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో పెళ్లి సందD (Pelli sandaD) మూవీతో హీరోయిన్గా శ్రీలీల(Sree Leela) ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల మొదటి స్థానంలో ఉంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పదికి పైగా సినిమాలు ఉన్నాయి.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో పెళ్లి సందD (Pelli sandaD) మూవీతో హీరోయిన్గా శ్రీలీల(Sree Leela) ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం, అభినయం, నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల మొదటి స్థానంలో ఉంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పదికి పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా శ్రీలీల రవితేజ(Ravi teja) ధమాకాతో సూపర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు శ్రీలీల(Sree leela) డేట్స్ దొరకడానికి డైరెక్టర్లు తలపట్టుకుంటున్నారు.
శ్రీలీల(Sree Leela) చేతిలో పదికి పైగా సినిమాలు ఉండటంతో ఆమె తన డేట్స్ ను గంటల పద్ధతిలో కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మార్నింగ్ సెషన్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటే లంచ్ తర్వాత ఇంకో సినిమా షూటింగులో ఉండేలా ఆమె ప్లాన్ చేస్తోందట. ఆమె సినిమాలలో గ్లామస్ డోస్ కూడా విపరీతంగా ఉంచేందుకు డైరెక్టర్లు పాట్లు పడుతున్నారట.
ఇప్పుడు టాలీవుడ్(Tollywood) లోని మిగిలిన హీరోయిన్లు శ్రీలీల(Sree Leela)ను చూసి కుళ్లుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. శ్రీలీల చేతిలో అన్ని సినిమాలు ఉండటంతో మిగిలిన హీరోయిన్లకు ఛాన్సులు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీలకు ఇచ్చే ప్రిపరెన్స్ మిగిలిన భామలకు ఇవ్వడం లేదు. అందుకే శ్రీలీలను మిగిలిన హీరోయిన్లు తిట్టిపోస్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.
ప్రస్తుతం శ్రీలీల(Sree Leela) మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలకృష్ణ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడున్న డిమాండ్ ను బట్టీ చూస్తే ఆమె సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా చేసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. సైన్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఆమె లీడిండ్ రోల్ లోనే కనిపిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలోనే శ్రీలీల తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. రెండు చేతులా సంపాదిస్తూ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటోంది. కానీ ఇతర హీరోయిన్లకు మాత్రం విలన్ గా మారుతోందని ఫిలిం నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా శ్రీలీల(Sree Leela) తన సినీ కెరీర్ ను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తోంది.