Prabhas : పాన్ వరల్డ్ స్టార్‌గా ప్రభాస్.. హ్యాట్రిక్ లోడింగ్!
Prabhas : సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చిన ప్రభాస్.. ఆ లోటును పూడ్చేందుకు.. ఏడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. అంతేకాదు.. బాహుబలితో రెబల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చిన ప్రభాస్.. ఆ లోటును పూడ్చేందుకు.. ఏడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. అంతేకాదు.. బాహుబలితో రెబల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కానీ అప్ కమింగ్ సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ నుంచి వరుసగా మూడు పాన్ వరల్డ్ సినిమాలు రాబోతున్నాయి. ముందుగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ హాలీవుడ్ దిశగా చర్చలు చేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ను ముందే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటూ ప్రకటించారు. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. 2024 జనవరి 12న ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న.. సలార్‌ను కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా విడుదల చేయాలని.. నిర్మాణ సంస్థ హంబోలే ఫిల్మ్స్ రంగం సిద్దం చేస్తోంది. ఇంగ్లీష్‌లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో జూన్ మొదలుకొని నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పాన్ వరల్డ్ జాతరేనని చెప్పొచ్చు. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాలతో పాన్ వరల్డ్ లెక్కలు మార్చబోతున్నాడు. ఇక పై ప్రభాస్ పాన్ వరల్డ్ హీరో అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి హాలీవుడ్ రేంజ్లో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.