NLR: ఉదయగిరి పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న దుకాణాలను SI కర్నాటి ఇంద్రసేనారెడ్డి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. పాఠశాలల సమీపంలోని దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఐదు దుకాణాలకు జరిమానా విధించినట్లు వెల్లడించారు.