GDWL: అయిజ మున్సిపాలిటీలో ₹3 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనం నిరుపయోగంగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తయారైందని గురువారం బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.రామచంద్రారెడ్డి ఆరోపించారు. గత రెండేళ్ల క్రితం కూరగాయలు, పూలు, పండ్లు విక్రయదారుల కోసం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉందన్నారు.