భూపాలపల్లి: జిల్లా కేంద్రానికి చెందిన లారీ అసోసియేషన్ కు చెందిన లారీలు జిల్లా కేంద్రంలో ఎక్కడ నిలిపినా గత 2 సం.లుగా దాదాపు 150 లారీల బ్యాటరీలు దోపిడీకి గురయ్యాయి. ఇటీవల ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. దీంతో లారీ యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాని బుధవారం రాత్రి ఓ లారీ బ్యాటరీ దొంగతనానికి గురికావడంతో యజమానుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.