MNCL: ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుర్రం రాజారాంరెడ్డి, సులువ జనార్దన్ కోరారు. గురువారం జన్నారంలోని ప్రెస్ క్లబ్లో జాబ్ మేళా పోస్టర్లు విడుదల చేశారు. జూలై 12న ఖానాపూర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారన్నారు.