NDL: నందికొట్కూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ప్రారంభమైంది. నందికొట్కూరు హైస్కూల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొని తల్లిదండ్రులతో విద్యార్థుల అభివృద్ధిపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న చర్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించారు.