GDWL: జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోలి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన 289 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విజయుడు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ పథకాలు పేద కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తాయని తెలిపారు.