VZM: రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన దత్తిరాజేరు మండలం మరడాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో చదివిన పూర్వ విద్యార్ధులను సన్మానించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.