KMM: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన కోడిగుడ్ల సరఫరా టెండర్‌ను ఆగస్టు మొదటి వారం నాటికి ఫైనల్ చేయాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో కోడిగుడ్ల సరఫరా టెండర్ ప్రక్రియ, కామన్ డైట్ మెనూ అమలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కామన్ డైట్ మెనూ అమలు జరిగేలా చూడాలన్నారు.